కిక్కెస్తున్న స్టార్ హీరో స్పై ఏజెంట్ లుక్

Published on Nov 11, 2019 9:01 am IST

స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ప్రకటించడమే కాకుండా ఆ మూవీకి సంబంధించిన ఓ లుక్ ని కూడా విడుదల చేశారు. రెడ్ కలర్ కార్ పక్కన సూట్ లో స్టైలిష్ గా ఉన్న అక్షయ్ వింటేజ్ లుక్ కేకగా ఉంది. ఇక వివరాలలోకి వెళితే అక్షయ్ కుమార్ హీరోగా, రంజిత్ తివారి దర్శకత్వంలో ‘బెల్ బాటమ్’ అనే మూవీ రానుంది. ఈ చిత్రంలో అక్షయ్ 80ల కాలం నాటి స్పై ఏజెంట్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది మధ్యలో షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రం 2021 జనవరి 22న విడుదల కానుంది. అక్షయ్ గత చిత్రాల బడ్జెట్ కి మించి ఈ చిత్రం నిర్మించనున్నారని సమాచారం.

ఇక అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం హౌస్ ఫుల్ 4 థియేటర్లలో సందడి చేస్తుంది. అక్షయ్, బాబీ డియోల్, రితేష్ దేశ్ ముఖ్ హీరోలుగా కృతి సనన్, పూజా హెగ్డే, కృతి కర్బంద హీరోయిన్స్ గా నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ 200కోట్ల వసూళ్లకు చేరువైంది. అక్షయ్ హౌస్ ఫుల్ 4 చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అక్షయ్ కి ఈ ఏడాది ఇది మూడవ హిట్ చిత్రం కావడం గమనార్హం.

సంబంధిత సమాచారం :

More