వరదల బాధితుల పట్ల అక్షయ్ ఔదార్యం చూస్తే భేష్ అనాల్సిందే.

Published on Jul 18, 2019 12:01 am IST

అస్సాం రాష్ట్రము ప్రస్తుతం వరదలతో అతలాకుతలం అవుతుంది. ఎడతెరిపేలకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం ఐయ్యింది. వాగులు,నదులు పొంగి నివాస ప్రాంతాలను ముంచెత్తడంతో వేలమంది నిరాశ్రయులయ్యారు. కొందరు నిలువ నీడ లేక,తినడానికి ఆహారం లేక అల్లాడుతున్నారు. అడవి మృగాలు సైతం వరదలలో చిక్కుకొని అల్లాడుతున్నాయి. పరిస్థితిని సమీక్షించిన మోడీ సర్కారు తక్షణ సాయంగా 250కోట్ల నిధులు విడుదల చేసింది. భద్రతా బలగాలు సహాయక చర్యలలో పాల్గొంటున్నాయి.

కాగా ఈసంఘటనపై స్పందించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరద బాధితుల సహాయార్ధం ఏకంగా 2కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన తన దయా హృదయాన్ని చాటుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. వరదబాధితుల సహాయార్ధం ఒక కోటి సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళం,అలాగే కజిరంగ్ జాతీయ పార్కులోని జంతువుల రక్షణార్థం మరో కోటి,ఎలా మొత్తం రెండు కోట్లు ఇవ్వడం జరిగింది. ఇలాంటి సందర్భాలలో స్పందించి సామజిక బాధ్యత నెరవేరుస్తున్న అక్షయ్ కుమార్ రియల్ హీరో అనిపించుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :