25 కోట్ల భారీ విరాళం ప్రకటించిన స్టార్ హీరో

Published on Mar 28, 2020 7:00 pm IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పీఎం రిలీఫ్ ఫండ్ కి భారీ విరాళం ప్రకటించారు. ఆయన ఏకంగా 25కోట్ల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించి ఆశ్చర్య పరిచారు. పీఎం కేర్స్ ఫండ్ పేరుతో నరేంద్ర మోడీ విరాళాలు ఇవ్వాలని పిలుపునివ్వగా దానికి స్పందనగా అక్షయ్ కుమార్ ఇంత పెద్ద అమౌంట్ ఇస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. ఇది మనుషుల ప్రాణాలకు సంబందిచిన విషయం. ఈ సమయంలో మనం చేయగలిగింది ఏదైనా చేయాల్సిందే. ప్రాణం ఉంటేనే మనకు ఓ స్నేహితుడు ఉంటాడు అని ఆయన ట్వీట్ లో చెప్పుకొచ్చారు.

కరోనా వైరస్ ప్రభావం అంత త్వరగా తగ్గే సూచనలు కనిపించడం లేదు. రోజు రోజుకు దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇక దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన హీరోలు, ప్రముఖులు కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వాలు చేస్తున్న కృషికి మద్దతుగా ఆర్థిక సాయం ప్రకటించారు. అక్షయ్ ఏకంగా 25 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి తన ప్రత్యేకత చాటుకున్నారు.

సంబంధిత సమాచారం :

X
More