కరీనా, కియారా గర్భవతులుగా..!

Published on Nov 14, 2019 1:54 pm IST

హౌస్ ఫుల్ 4 మూవీతో ముగ్గురు యంగ్ కపుల్ మధ్య కన్ఫ్యూజ్డ్ లవ్ డ్రామా తో హాస్యం పండించి హిట్ అందుకున్నారు అక్షయ్ కుమార్. తన నెక్స్ట్ మూవీ కూడా కామెడీ జోనర్ లోనే రావడం గమనార్హం. గుడ్ న్యూస్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ వినూత్న కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. కృత్రిమ పద్దతిలో గర్భం దాల్చే యువతులుగా కియారా అద్వానీ, కరీనా కపూర్ నటించనున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ ని నేడు విడుదల చేశారు. గర్భవతులుగా ఉన్న కియారా, కరీనా మధ్యలో కన్ఫ్యుజ్ అవుతున్న అక్షయ్ లుక్ ఆసక్తికరంగా ఉంది.

రాజ్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ధర్మ ప్రొడక్షన్స్, కేఫ్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. క్రిస్మస్ కానుకగా వచ్చే నెల 27న ఈ మూవీ విడుదల కానుంది. ఇక అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ ఇంకా థియేటర్లలో సందడి చేస్తుంది. గత నెల 25న దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 200కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

సంబంధిత సమాచారం :

More