‘బచ్చన్ పాండే’ గా అక్షయ్, విభిన్నంగా ఫస్ట్ లుక్

Published on Jul 26, 2019 11:18 am IST

అక్షయ్ కుమార్ మరో కొత్త సినిమా ప్రకటించి ఆశ్చర్య పరిచారు. కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా తన కొత్త మూవీకి సంబంధిచిన పోస్టర్ ని విడుదల చేశాడు. నుదిటి ఫై విబూది,మెడలో గోల్డ్ చైన్లు,మోకాళ్ళ పైవరకు ఉన్న నల్లని పంచె కట్టుకొని ఉన్న అక్షయ్ చేతిలో మార్షల్ ఆర్ట్స్ ఆయధమైన నాన్ చాక్ ఉండటం ఆసక్తిని రేపుతోంది. “బచ్చన్ పాండే” పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ అయివుంటుందని పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది.

ఫర్హాద్ సామ్జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియావాలా నిర్మిస్తుండగా, వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. అక్షయ్ నటించిన తాజా చిత్రం ‘మిషన్ మంగళ్’ ఆగస్టు 15న విడుదల కానుండగా, హౌస్ ఫుల్ 4, సూర్యవంశీ,లక్ష్మీ బాంబ్, గుడ్ న్యూస్ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. తాజాగా బచ్చన్ పాండే చిత్రాన్ని ప్రకటించి తన స్పీడ్ ని ఎవరు అందుకోలేరని నిరూపిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :