‘అల వైకుంఠపురములో’.. మరో సర్‌ప్రైజ్ !

Published on Nov 12, 2019 9:29 am IST

‘అల వైకుంఠపురములో’ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన దగ్గరనుంచీ చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదలయి.. అవి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. కాగా తాజాగా ఈ సినిమా నుండి ఈ నెల 14న మరో స్పెషల్ సర్ప్ర సర్ ప్రైజ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సర్ ప్రెయిజ్ పాటనో లేక టీజరో చూడాలి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు.

ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More