‘అల వైకుంఠపురములో’ హవా..36వ రోజు కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్

Published on Feb 17, 2020 8:28 am IST

సినిమా మాస్ ప్రేక్షకులకు దగ్గరైతే ఓపెనింగ్స్, ఫస్ట్ వీక్ కలెక్షన్లు బాగుంటాయి. అదే ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరైతే లాంగ్ రన్ బాగుంటుంది. ఈ విషయాన్ని ‘అల వైకుంఠపురములో’ చిత్రం మరోసారి నిరూపించింది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుని, మంచి వసూళ్లతో సూపర్ హిట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో ఇప్పటికీ మంచి రన్ కనబరుస్తోంది.

36వ రోజైన నిన్న ఆదివారం కూడా విజయవాడ, కాకినాడ, శ్రీకాకుళం, భీమవరం, రాజమండ్రిలతో పాటు ఇంకొన్ని ఏరియాల్లో కూడా మ్యాటనీ షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. హైదరాబాద్ సిటీలోని దేవి 35 ఎమ్ ఎమ్ నందు 95 శాతం ఆక్యుపెన్సీ కనబడింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయంతో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ నమోదైంది.

సంబంధిత సమాచారం :

సంబంధిత సమాచారం :

    X
    More