అన్ని సెంటర్లలోనూ ‘అల వైకుంఠపురములో’ అలజడి

అన్ని సెంటర్లలోనూ ‘అల వైకుంఠపురములో’ అలజడి

Published on Jan 15, 2020 9:45 PM IST

త్రివిక్రమ్ సినిమా అంటే ఏ సెంటర్ సినిమా అనే అభిప్రాయం ఉండేది ప్రేక్షకుల్లో. ఆయన సినిమాలు ఏ నుండి సి వరకు అన్ని సెంటర్ల ప్రేక్షకుల్ని ఒకే తరహాలో అలరించడం ‘అత్తారింటికి దారేది, అ..ఆ’ లాంటి సినిమాలతోనే సాధ్యమైంది. మళ్లీ ఆ ఫీట్ ఇన్నాళ్ళకు ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో సాధ్యమైంది. అందుకు ప్రధాన కారణం అల్లు అర్జున్ అనే అనాలి.

బీ, సీ సెంటర్లలో బన్నీకి ఉన్న క్రేజ్ మూలాన సినిమా భారీ వసూళను రాబడుతోంది. మూడు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ.47 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా మూడు రోజుల్లో ప్రతి రోజూ 10 కోట్లకు పైగా షేర్ రాబట్టి అరుదైన రికార్డ్ నెలకొల్పింది. పండుగ సెలవులు కలిసి రాడంతో సినిమాకు దాదాపు అన్ని చోట్లా హౌస్ ఫుల్ ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. మొత్తం మీద ‘అల వైకుంఠపురములో’ చిత్రం గట్టి పోటీ ఉన్నా మాస్, క్లాస్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించగలగడంతో అతి త్వరలోనే బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు