బన్నీ సినిమా పై ‘సుశాంత్’ ఆసక్తికరమైన ట్వీట్ !

Published on Feb 16, 2020 1:38 pm IST

అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి.. సూపర్ పాజిటివ్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను నమోదు చేసిన సినిమాగా ఈ సినిమా నిలిచింది. పైగా నాన్ బాహుబలి రికార్డ్స్ ను కూడా కొట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో యంగ్ హీరో సుశాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. సుశాంత్ పాత్ర నిడివి తక్కువ ఉన్నా.. బన్నీతో పోల్చుకుంటే సుశాంత్ కు అంతగా ప్రాధాన్యత లేకపోయినా సుశాంత్ కు మాత్రం మంచి పేరే వచ్చింది. కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం సుశాంత్ పాత్ర పై పెదవి విరుస్తున్నారు.

కాగా ఈ కామెంట్స్ పై సుశాంత్ ట్వీట్ చేస్తూ.. ‘అల వైకుంఠపురములో’ నటించడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఆ సినిమా చేసినందుకు నేను చాల సంతోషిస్తున్నాను. ఇక స్క్రీన్ టైం విషయానికి వస్తే.. భారీ తారాగణం, ప్రతిభావంతులైన సాంకేతిక బృందంతో పనిచేస్తున్నప్పుడు, టీం ప్లేయర్ గానే ఉండాలి. ఇక సినిమాలో మిస్ అయిన నా దృశ్యాలు కొన్ని త్వరలో యూట్యూబ్ లో రిలీజ్ అవుతాయి అని పోస్ట్ చేశారు.

కాగా సుశాంత్ ప్రస్తుతం ఎస్.దర్శన్ దర్శకత్వంలో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’లో నటిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా పరిచయం అవుతుంది. వెంకట్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం కీలక పాత్రలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :