వైజాగ్ లో భారీ రికార్డ్ క్రియేట్ చేసుకున్న బన్నీ!

Published on Feb 16, 2020 12:01 pm IST

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగా బన్నీ కెరీర్లో కొత్త రికార్డుల్ని క్రియేట్ చేసింది ఈ చిత్రం. ఇక విడుదలైన నాటి నుండి వైజాగ్ సిటీలో ఇతర అన్ని సినిమాలను డామినేట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం వైజాగ్ లోని రెండు సింగిల్ స్క్రీన్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్ ను రాబట్టింది.

కాగా వైజాగ్ లోని మెలోడీ థియేటర్ లో మొత్తం 28 రోజులకు గానూ రూ. 1,00,98,121 / – అలాగే శరత్ థియేటర్ లో మొత్తం 35 రోజులకు గానూ రూ. 1,00,18,228 / – కలెక్షన్స్ తో భారీ రికార్డ్ నమోదు చేసింది.

ఇప్పటివరకూ దాదాపు ఈ రేంజ్ కలెక్షన్స్ వైజాగ్ లో ఏ హీరో సినిమా రాబట్టలేదు. బన్నీ చిత్రం ఈ రికార్డ్ సాధించడం విశేషమనే అనాలి. ఇకపోతే బన్నీ తన తర్వాతి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై బన్నీ అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకులందరిలో భారీ అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More