అక్కడ బన్నీ ఫ్యాన్స్ హంగామా మొదలైపోయింది

Published on Nov 7, 2019 9:57 pm IST

బన్నీ త్రివిక్రమ్ ల లేటెస్ట్ వెంచర్ అలవైకుంఠపురంలో మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. కొన్ని పాటలు మరియు సన్నివేశాల చిత్రీకరణ కొరకు అలవైకుంఠపురంలో టీం విదేశాలకు వెళ్లారు. కాగా ఈ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజును పురస్కరించుకొని మలయాళ టైటిల్ పోస్టర్ మరియు బన్నీ లుక్ విడుదల చేశారు. కోపంగా విలన్స్ కొరకు పరుగెడుతున్నట్లున్న బన్నీ లుక్ కేకగా ఉంది. ఐతే కేరళ బన్నీ ఫ్యాన్స్, పోస్టర్ విడుదలైన వెంటనే హంగామా మొదలుపెట్టేశారట. ఫస్ట్ లుక్ పోస్టర్ బ్యానర్స్ సిద్ధం చేయడమే కాకుండా అక్కడక్కడా వాటిని ప్రదర్శిస్తూ తమ అభిమానం తెలియజేస్తున్నారట. ప్రస్తుతం కేరళ వ్యాప్తంగా అలవైకుంఠపురంలో మలయాళ బ్యానర్స్ దర్శనమిస్తున్నాయని సమాచారం.

గత కొన్నేళ్లుగా అల్లు అర్జున్ కి కేరళలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వస్తుంది. ఆయనకు అక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా ఉండటం విశేషం.ఇక తెలుగులో సూపర్ హిట్ అయిన సామజవరగమనా…సాంగ్ మలయాళ వర్షన్ ఈనెల 10న విడుదల చేయనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా, టబు, సుశాంత్ కీలక పాత్రలలో కనిపించనున్నారు.వచ్చే సంక్రాంతికి రానున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందించారు.

సంబంధిత సమాచారం :