అలవైకుంఠపురంలో టీజర్ అప్డేట్ కి బ్రేక్ ..!

Published on Dec 8, 2019 12:19 pm IST

చాలా కాలంగా మెగా స్టార్ చిరంజీవి అభిమానిగా ఉన్న నూర్ భాయ్ హఠాన్మరణం చెందారు. ఆయన కేవలం అభిమాని మాత్రమే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి అభిమాన సంఘ అధ్యక్షుడు కూడా కావడం గమనార్హం. అనారోగ్య కారణాల రీత్యా ఆయన మరిణించినట్లు తెలుస్తుంది. ఏళ్లుగా నూర్ భాయ్ చిరంజీవి కుటుంబానికి చాలా సన్నిహితుడిగా ఉంటూ వస్తున్నారు. ఒక్క చిరంజీవి సినిమాలనే కాకుండా మెగా ఫ్యామిలీలో ఏ హీరో మూవీ విడుదలైనప్పటికీ దానికి సంబంధించిన కార్యక్రమాలు నూర్ భాయ్ చూసుకొనే వారు.

ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి దిగ్బ్రాంతికి గురైయ్యారు. నూర్ కుటుంబానికి ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నేడు చిరంజీవితో పాటు మెగా హీరోలు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం కలదు. నూర్ భాయ్ మృతి కారణంగా నేడు అలవైకుంఠపురంలో టీజర్ విడుదల అప్డేట్ కూడా వాయిదా వేసినట్టు గీతా ఆర్ట్స్ ప్రకటించింది. నేడు ఉదయం 10:00 గంటలకు అలవైకుంఠపురంలో టీజర్ విడుదల తేదీ ప్రకటించాల్సి ఉండగా, ఇలాంటి విషాద సంఘటన నేపథ్యంలో మేము అలవైకుంఠపురంలో సినిమా టీజర్ కి సంబంధించి అప్డేట్ ఇవ్వలేమని గీతా ఆర్ట్స్ ప్రకటించింది. ఇక రేపు లేదా సాయంత్రం అలవైకుంఠపురంలో టీజర్ పై అప్డేట్ వచ్చే వచ్చే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :

X
More