వైరల్ : ఒక్క పోస్ట్ కే ఆలియా అంత తీసుకుంటుందా ?

Published on Aug 7, 2022 10:04 pm IST

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆలియా తన ఇన్ స్టాగ్రామ్ లో ఏదైనా ఒక కమర్షియల్ యాడ్ లేదా పోస్ట్ చేయడానికి భారీ మొత్తంలో డిమాండ్ చేస్తోందట. అంటే దాదాపు ఒక్క పోస్ట్ కి ₹80 లక్షల నుంచి కోటి వరకు వసూలు చేస్తుందని తెలుస్తోంది. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇది నిజమే అని తెలుస్తోంది.

మొత్తానికి ఇన్ స్టాగ్రామ్ లో ఆలియాకి భీభత్సమైన పాపులారిటీ దక్కింది. ఆ పాపులారిటీని ఆలియా బాగానే క్యాష్ చేసుకుంటుంది. ఇక 2021లో డఫ్ అండ్ ఫెల్ప్స్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ ప్రకారం, ఆలియా బ్రాండ్ విలువ $68.1 మిలియన్లుగా ఉంది. మొత్తానికి ఆలియా, రణబీర్ కపూర్ తో పెళ్లి తర్వాత కూడా తనదైన శైలిలో దూసుకెళ్తుంది. అన్నట్టు రీసెంట్‌ గానే ఆలియా ప్రెగ్నెన్సీ అయిన సంగతి కూడా తెలిసిందే. ఆలియా గర్బం దాల్చినా, షూటింగ్స్‌ కి మాత్రం బ్రేక్‌ ఇవ్వడం లేదు.

సంబంధిత సమాచారం :