నేరుగా ఓటీటీలోకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మూవీ..!

నేరుగా ఓటీటీలోకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మూవీ..!

Published on May 25, 2022 2:25 AM IST

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా మారింది. ‘గంగూభాయ్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి సక్సెస్‌ ఫుల్‌ మూవీస్‌ తర్వాత ఆలియా చేతున్న ప్రాజెక్ట్స్‌పై మరింత అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం ఆలియా తన హాలీవుడ్‌ డెబ్యూ మూవీ “హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌” చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఆలియా నటించిన డార్లింగ్స్‌ మూవీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్‌. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది.

అయితే డార్లింగ్స్‌ మూవీని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్‌ అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేయబోతున్నట్లు మేకర్స్‌ స్పష్టం చేశారు. త్వరలోనే విడుదల తేదీ, స్ట్రీమింగ్‌ టైం వెల్లడి కానున్నాయి. కామెడీ, సస్సెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీని బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ తన సొంత నిర్మాణ సంస్థ రెడ్‌చీల్లి ఎంటర్‌టైన్మెంట్‌లో తెరకెక్కించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు