‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో అందరికంటే ముందు జాయిన్ అయ్యేది ఎవరంటే..

Published on Sep 18, 2020 12:05 am IST


తెలుగు సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ భారత సినీ అభిమానులు ఎంతో ఆసక్తిని పెంచుకున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి 2’ తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడం, రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ నిలిచిపోవడంతో సినిమా విడుదల కూడ చాలా వెనక్కు వెళ్లింది. దీంతో ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. గతం కంటే పరిస్థితులు చక్కబడటంతో రాజమౌళి సినిమా చిత్రీకరణను రీస్టార్ట్ చేయడానికి సిద్దమయ్యారు.

అక్టోబర్ మొదటి వారంలో సినిమా పనులు మొదలవుతాయట. ఇక హీరోలు రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ ఇద్దరూ నవంబర్ నెల నుండి చిత్రీకరణలో పాల్గొంటారట. ఈలోపు హీరోయిన్ అలియా భట్ షూటింగ్లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. అంటే అందరికంటే ముందే ఆమె సినిమాలో జాయిన్ అవుతారనుకోవాలి. నవంబర్ నాటికి పూర్తిస్థాయి నటీనటులతో షూటింగ్ జరిగే వీలుంది. ఇప్పటికే పూర్తైన సన్నివేశాల తాలూకు ఫుటేజ్ యొక్క సీజీ వర్క్ కూడ దాదాపు ఒక కొలిక్కి వచ్చిందట. ఇక మిగిలింది కొత్త సన్నివేశాల చిత్రీకరణే.

విడుదల ఇప్పటికే ఆలస్యం కావడంతో ఇకపై మొదలుకాబోయే షెడ్యూల్ వేగంగా జరగనుంది. పైగా రామ్ చరణ్, తారక్ వేరే దర్శకులకు కమిట్మెంట్ ఇచ్చి ఉండటంతో జక్కన్న వేగంగా సినిమాను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ చిత్రంలో తారక్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనుండగా చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చరణ్ చేస్తున్న సీతారామరాజు పాత్ర తాలూకు టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా ఎన్టీఆర్ యొక్క కొమురం భీమ్ పాత్ర యొక్క టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More