రాజమౌళి మొదలుపెట్టినా ఆమె రావడం కష్టమే.!

Published on Jul 14, 2020 8:33 am IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రస్తుతం మూడు భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తోపాటు బ్రహ్మాస్త్ర మరియు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న మరో చిత్రంలో కూడా ఆమె నటిస్తుంది. కాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అలియా షూటింగ్స్ కి ససేమిరా అంటుందని సమాచారం. ఒక వేళ షూటింగ్ మొదలైనా ఆమె పాల్గొనడానికి సముఖంగా లేరట. ఓ ప్రక్క రాజమౌళి ఎలాగైనా త్వరలో షూట్ మొదలుపెట్టాలని చూస్తున్నారు.

రాజమౌళి ఒక వేళ షూటింగ్ మొదలుపెట్టినా ఆమె రావడం కష్టమే అన్నమాట వినిపిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ లో అలియా ప్రధాన హీరోయిన్ గా నటిస్తుంది. అల్లూరి పాత్ర చేస్తున్న చరణ్ కి జోడిగా ఆమె నటిస్తుంది. ఇక మరో స్టార్ హీరో ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీమ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More