అలా ఏం జరగలేదంటున్న ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్

Published on Jan 22, 2020 3:00 am IST

బాలీవుడ్ క్వీన్ అలియా భట్ సోషల్ మీడియా ద్వారా ఓ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తనపై వస్తున్న వరుస కథనాలకు స్పష్టత ఇచ్చారు. విషయంలోకి వెళితే అలియా భట్ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో గంగూ భాయి కటియావాడి అనే చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్నారు. ఒకప్పటి ముంబై మాఫియా లేడీ డాన్ గా చలామణి అయిన గంగూ భాయి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. లేడీ మాఫియా లీడర్ రోల్ చేస్తున్న అలియాకు ఈ చిత్ర షూటింగ్ సెట్ లో గాయం అయిందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. వీటికి సమాధానంగా ఆమె ఓ స్టేట్మెంట్ ఇచ్చారు.

నాకు గంగూ భాయి కటియావాడి చిత్ర షూటింగ్ లో ఎటువంటి గాయం కాలేదు, మీరు చూసిన చిన్న గాయం ఇంట్లో ఉండగా తగిలిన గాయం, నాపై పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసే ముందు కొంచెం అడిగి తెలుసుకోండి అని మీడియాపై సెటైర్ వేశారు. ఇక అలియా ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి పాత్ర చేస్తున్న చరణ్ కి హీరోయిన్ గా నటిస్తుంది. దీనితో పాటు కరణ్ జోహార్ నిర్మిస్తున్న మరో భారీ బడ్జెట్ మూవీ బ్రహ్మాస్త్రలో కూడా ఆమె ప్రధాన హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :