టీజర్ లేదు.. డైరెక్ట్ ట్రైలర్ అంటున్న ‘అలియాస్ రుక్మిణి’

టీజర్ లేదు.. డైరెక్ట్ ట్రైలర్ అంటున్న ‘అలియాస్ రుక్మిణి’

Published on Nov 23, 2026 6:00 PM IST

న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో, నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణి’ నుంచి మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి టీజర్ లేకుండానే నేరుగా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.

నవంబర్ 26న ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తిని పెంచేశారు. మురళీకాంత్ దేవసొత్ రచన మరియు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆఫియా సయ్యద్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా, జోమోన్ టి. జాన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మరి ఈ ట్రైలర్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు