ఎట్టకేలకు ‘దేవర’ శాటిలైట్ రైట్స్ అమ్మకం.. దక్కించుకుంది ఎవరంటే..?

ఎట్టకేలకు ‘దేవర’ శాటిలైట్ రైట్స్ అమ్మకం.. దక్కించుకుంది ఎవరంటే..?

Published on Nov 23, 2026 5:00 PM IST

Devara

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దేవర’ తెలుగు టెలివిజన్ ప్రీమియర్ కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 2024 సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో పాటు, ఓటీటీలోనూ మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం తెలుగు శాటిలైట్ హక్కులు మాత్రం ఇప్పటివరకు అమ్ముడుపోలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ సంస్థ ‘సోనీ’ ఈ సినిమా తెలుగు శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాల టెలివిజన్ మార్కెట్‌పై పలు సందేహాలు నెలకొన్న తరుణంలో, సోనీ సంస్థ ముందుకు రావడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. మరి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రన్ కొనసాగించిన దేవర బుల్లితెర ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటాడో చూడాలి.

తాజా వార్తలు