“టైమ్స్ మోస్ట్ డిసైరబుల్ విమెన్” గా ‘ఆర్ ఆర్ ఆర్’ హీరోయిన్.

Published on May 25, 2019 12:54 pm IST

“టైమ్స్ మోస్ట్ డిసైరబుల్ విమెన్-2018″గా బాలీవుడ్ బబ్లీ బ్యూటీ అలియా భట్ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ నిర్వహించిన పోల్ లో బాలీవుడ్లో ఉన్న అందరు సుందరాంగులును వెనక్కునెట్టి అలియా ఈ అరుదైన గౌరంవం దక్కించుకుంది. గత సంవత్సరం 37 వ స్థానంలో ఉన్న అలియా ఏకంగా 36స్థానాలు మెరుగుపరుచుకుని, నెంబర్ వన్ పోజిషన్ కి చేరించి.

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పాడుకొనే రెండవ స్థానం నుండి క్రింది జారీ నాల్గవ పొజిషన్లో ఉండగా, మరో టాప్ హీరోయిన్ కత్రినా ఒక స్థానం మెరుగు పరుచుకొని మూడవ స్థానానికి చేరింది. ఇక టాప్ ఫైవ్ లో కొత్తగా ఈ లిస్ట్ లో స్థానం పొందిన మీనాక్షి చౌదరి రెండు, గాయత్రీ భరద్వాజ్ ఐదు తో టాప్ ఫైవ్ లో స్థానం సంపాదించారు.

2012 దర్శకనిర్మాత కరణ్ జోహార్ డైరెక్షన్ లో వచ్చిన “స్టూడెంట్ అఫ్ ది ఇయర్” మూవీతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన అలియా పలు హిట్ మూవీస్ లో నటించింది.దర్శకధీరుడు రాజమౌళి, తారక్ చరణ్ లతో చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ ” ఆర్ ఆర్ ఆర్” లో చరణ్ కి జోడీ గా అలియా నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ సెట్ లో జరుగుతున్నషూటింగ్ షెడ్యూల్ లో అలియా జాయిన్ అయినట్టు సమాచారం.

సంబంధిత సమాచారం :

More