చిరు – మణిశర్మల మ్యాజిక్ రిపీట్ కానుందా.!

Published on Mar 31, 2021 11:07 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను అనౌన్స్ చేసినప్పుడు కంటే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మను అనౌన్స్ చెయ్యడంతో ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్ మరింత స్పెషల్ అయ్యింది. ఇప్పటికే చిరు మరియు మణిశర్మల కాంబో అంటే మంచి క్రేజ్ ఉంది. కానీ చాలా ఏళ్ళు గ్యాప్ అనంతరం ఈ సినిమా అనౌన్స్మెంట్ రావడంతో భారీ అంచనాలు సెట్టయ్యాయి.

దీనితో ఈ మ్యాజికల్ కాంబో నుంచి సాంగ్స్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఎదురు చూసారు. కానీ ఎట్టకేలకు ఆ అప్డేట్ తో పాటుగా నిన్ననే చిన్న ప్రోమో విడుదల చెయ్యడంతో అన్ని అంచనాలు కరెక్ట్ గానే ఉన్నాయని చెప్పాలి. చిరు గ్రేస్ కి తగ్గట్టుగా మణిశర్మ కంపోజ్ చేసిన బిట్ మళ్ళీ పాత రోజులను గుర్తు చేసింది.

అందుకే ఇప్పుడు ఫుల్ సాంగ్ కోసం ఆసక్తిగా అంతా ఎదురు చూస్తున్నారు. మరి ఇదిలా ఉండగా మేకర్స్ ఈ సాంగ్ మంచి ఫోక్ అండ్ మెలోడీగా ఉంటుందని తెలిపారు. మొత్తానికి మాత్రం ఈ సాంగ్ కోసం ఈ ఆచార్య ఆల్బమ్ కోసం మెగా ఫ్యాన్స్ సహా చిరు మరియు మణిశర్మల కాంబో అంటే క్రేజ్ ఉన్న వారు అంతా గట్టిగానే ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :