“కేజీయఫ్ 2” క్లారిటీ పై అంతా వెయిటింగ్.!

Published on Aug 4, 2021 9:00 am IST


ఇప్పుడు మళ్ళీ దేశంలో కరోనా నిలకడగా ఉన్న నేపథ్యంలో మళ్ళీ థియేటర్స్ తెరుచుకోవడం సినిమాలు విడుదల అవుతుండడం నెమ్మదిగా ప్రారంభం అయ్యింది. ఇక ఇదిలా ఉండగా వాటితో పాటు రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు తమ విడుదల తేదీలు లాక్ చేసే పనిలో పడగా పలు భారీ చిత్రాలు ఆల్రెడీ లాక్ చేసేసాయి.

మరి ఈ లిస్ట్ లో మోస్ట్ అవైటెడ్ పాన్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” ఎప్పుడు నిలుస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా నిన్ననే అల్లు అర్జున్ పాన్ ఇండియన్ సినిమా పుష్ప క్రిస్మస్ రేస్ లో డేట్ ని లాక్ చేసుకోగా కేజీయఫ్ 2 రిలీజ్ ఎప్పుడు అన్నది మరింత ఆసక్తిగా మారింది. దీనితో ఈ క్లారిటీ కోసం మూవీ లవర్స్ చాలా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా హోంబలే నిర్మాణ సంస్థ వారు భారీ బడ్జెట్ వెచ్చించారు.

సంబంధిత సమాచారం :