సందీప్ రెడ్డి లేని అర్జున్ రెడ్డి సక్సెస్ అవుతాడా…?

Published on Nov 21, 2019 9:50 am IST

2017లో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ ఓ సంచలనం. తీవ్రమైన ఎమోషన్స్ కలిగిన మోడ్రన్ దేవదాస్ కాన్సెప్ట్ తో వినూత్నంగా తెరకెక్కిన ఆ చిత్రం హీరో విజయ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా జీవితాలను మార్చివేసింది. పెళ్లిచూపులు సినిమాతో నటుడుగా పేరుతెచ్చుకున్న విజయ్ దేవరకొండను అర్జున్ రెడ్డి మూవీ సెన్సేషనల్ హీరోని చేసింది. సందీప్ రెడ్డి వంగా ఈచిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ తో చేయగా అక్కడ తెలుగుకు మించిన ప్రభంజనం సృష్టించింది. షాహిద్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ చిత్రం సల్మాన్, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్ చిత్రాలను వెనక్కు తోసి 2019సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది.

కాగా ఈ చిత్రం తమిళంలో ఆదిత్య వర్మ పేరుతో తెరకెక్కింది. రేపు ఈచిత్రం గ్రాండ్ గా విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు గిరీశాయ తెరకెక్కించారు. మహానటి, అర్జున్ రెడ్డి చిత్రాలకు కో డైరెక్టర్ గా వర్క్ చేసిన గిరీశాయ ఆదిత్య వర్మ చిత్రాన్ని ఎలా తెరకెక్కించాడు అనేది ఆసక్తికరంగా మారింది. స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతుండగా, బనిత సంధు హీరోయిన్ గా నటిస్తుంది. సందీప్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన రెండు భాషలలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం తమిళంలో ఎటువంటి ఫలితాన్ని చవిచూస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More