భీష్మ ట్రైలర్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి

Published on Feb 17, 2020 10:56 am IST

హీరో నితిన్ ఏడాదికి పైగా గ్యాప్ తరువాత భీష్మ చిత్రంతో వస్తున్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు సాంగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. దీనితో సినిమాపై అంచనాలు బాగున్నాయి. కాగా నేడు భీష్మ ట్రైలర్ విడుదల కానుంది. సాయంత్రం 4:05నిముషాలకు భీష్మ ట్రైలర్ విడుదల అవుతుండగా, దర్శకుడు త్రివిక్రమ్ అతిధిగా హాజరుకానున్నారు.

కాగా భీష్మ ట్రైలర్ పై యూత్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే అందరూ ఈచిత్ర ట్రైలర్ కొరకు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నితిన్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. భీష్మ చిత్రానికి సంగీతం మహతి స్వర సాగర్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More