పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న అవైటెడ్ చిత్రాల్లో ఒకటే దర్శకుడు మారుతితో ప్లాన్ చేసిన సినిమా ది రాజా సాబ్ కూడా ఒకటి. మంచి బజ్ ని అభిమానుల్లో రేకెత్తించిన ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్ ను మేకర్స్ ప్రామిస్ చేస్తున్నారు. ఇలా రీసెంట్ గా వదిలిన రెండో సాంగ్ ప్రోమో చూసి కూడా అంతా ఎగ్జైట్ అయ్యారు.
ఇక ఈ ఫుల్ సాంగ్ కోసం అంతా నేడు మరింత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. నేడు సాయంత్రం సాంగ్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండగా ఈ సాంగ్ పైనే అందరి కళ్ళు ఉన్నాయి. ప్రోమో సాంగ్ కి మాత్రమే కాకుండా ప్రభాస్ లుక్స్, నిధి అగర్వాల్ గ్లామర్ లకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి థమన్ ఫుల్ ఫ్లెడ్జ్ సాంగ్ ఎలా అందించాడా అని అందరి కళ్ళు దీనిపై ఉన్నాయి. సో ఈ సాయంత్రం వరకు అందుకు ఆగాల్సిందే అని చెప్పాలి.


