‘ఉస్తాద్’ ట్రీట్ పై అందరి కళ్ళు.!

‘ఉస్తాద్’ ట్రీట్ పై అందరి కళ్ళు.!

Published on Mar 19, 2024 7:07 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల (Sree leela) హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో చేస్తున్న అవైటెడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh) కోసం అందరికీ తెలిసిందే. మరి కొంతమేర షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గానే సాలిడ్ ట్రీట్ కి మేకర్స్ డేట్ కన్ఫర్మ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆ డేట్ రానే వచ్చింది. దీనితో ఈ ట్రీట్ కోసం ఇప్పుడు ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ చిత్రం కొత్త వీడియోకి పవన్ దగ్గరకి వెళ్ళి మరీ హరిష్ డబ్బింగ్ చెప్పించుకున్నాడు ఇప్పుడు ఆ పవర్ఫుల్ డైలాగ్ పైనే అందరి కళ్ళు పడ్డాయి. అసలే గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి డైలాగ్స్ పరంగా కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి చూడాలి ఈ డైలాగ్ కట్ ఎలా ఉంటుందో అనేది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు