ఫైనల్ గా ‘మన శంకర వరప్రసాద్ గారు’ బిగ్ క్లారిటీకి ఆల్ సెట్!

ఫైనల్ గా ‘మన శంకర వరప్రసాద్ గారు’ బిగ్ క్లారిటీకి ఆల్ సెట్!

Published on Dec 12, 2025 7:01 PM IST

Mana-Shankara-Vara-Prasad-G (1)

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమాలో వెంకీ మామ కూడా కీలక పాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ డేట్ ఎప్పుడు ఇస్తారా అని వారు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ డేట్ అనౌన్స్ చేసేందుకు ఇప్పుడు ఎట్టకేలకి రంగం సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది. మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్ డేట్ ఎప్పుడు ఏంటి అనే దానిపై మేకర్స్ రేపు ఓ ప్రెస్ మీట్ ని పెట్టి అందులో రివీల్ చేయనున్నారట. సో ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఆ బిగ్ డే రానుంది అని చెప్పాలి. మరి ఆ డేట్ ఏంటి అనేది చూడాల్సిందే. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు అలాగే షైన్ స్క్రీన్ వారు ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు