“పుష్ప 2” పై బ్లాస్టింగ్ అప్డేట్స్ కి ఆల్ సెట్..!

“పుష్ప 2” పై బ్లాస్టింగ్ అప్డేట్స్ కి ఆల్ సెట్..!

Published on Nov 2, 2022 2:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “పుష్ప ది రైజ్” కోసం అందరికీలే తెలిసిందే. ఇక దీని తర్వాత కొనసాగింపుగా రానున్న మరో భారీ చిత్రం పుష్ప ది రూల్ పై అయితే నెక్స్ట్ లెవెల్ అంచనాలు కూడా నెలకొన్నాయి. మరి దీనితో ఎప్పుడెప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు పుష్ప 2 పై సాలిడ్ డీటెయిల్స్ బయటకి వచ్చాయి.

మరి ఈ చిత్రం అయితే నవంబర్ లో రెండో వారం నుంచి షూటింగ్ స్టార్ట్ చేసుకోడానికి సన్నద్ధం కాగా దీనిపై మరిన్ని డీటెయిల్స్ అప్డేట్ చెయ్యబోతున్నట్టుగా యూనిట్ నుంచి ఇప్పుడు సాలిడ్ క్లారిటీ వచ్చింది. దీనితో ఇక పుష్ప ది రూల్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రంలో మరింత మంది స్టార్స్ కనిపించనుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు