స్వీటీ అనుష్క గత ఏడాది భాగమతిగా ప్రేక్షకులను ఒక రేంజ్ లో భయపెట్టారు. హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. భాగమతి చిత్రంలో అనుష్క నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దర్శకుడు అశోక్ ఈ మూవీని ఓ భిన్నమైన కథాంశంతో హారర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించారు. కాగా ఈ మూవీ బాలీవుడ్ లో రీమేక్ కానుంది. ఎప్పటినుండో భాగమతి చిత్రం హిందీలో రీమేక్ కానుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో నేడు దీనిపై స్పష్టత వచ్చింది.
స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ మూవీ నిర్మాణ భాగస్వామిగా ఈ చిత్రం హిందీలో తెరకెక్కుతుంది. భాగమతి చిత్రాన్ని హిందీలో దుర్గావతి గా తెరకెక్కిస్తుండగా, హీరోయిన్ భూమి పెడ్నేకర్ అనుష్క రోల్ చేస్తున్నారు. విక్రమ్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో భాగమతి చిత్రానికి దర్శకత్వం వహించిందే కూడా ఈయనే. వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
EXCITED to announce @bhumipednekar in & as #DURGAVATI. A scary-thriller, going on floor mid-January. Presented by #CapeOfGoodFilms and @itsBhushanKumar, produced by @vikramix and directed by Ashok. Need your love and luck ???? @TSeries @Abundantia_Ent pic.twitter.com/VsOpXFN6YG
— Akshay Kumar (@akshaykumar) November 30, 2019


