అన్నపూర్ణ స్టూడియో లో అదిరిపోయే స్టెప్పులేయనున్న ప్రభాస్

Published on May 23, 2019 6:40 pm IST

ప్రస్తుతం ప్రభాస్ సుజిత్ డైరెక్షన్లో “సాహో” సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆగస్టు 15 న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గా విడుదల చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రికార్డు లైక్స్ సాధించి చరిత్ర సృష్టించింది.

ఇక ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో జరగనుంది. ఓ స్పెషల్ సాంగ్ చితీకరణలో భాగంగా కలర్ ఫుల్ రిచ్ పబ్ సెట్ ని నిర్మిస్తున్నారు. దాదాపు ఐదు రోజుల పాటు చిత్రీకరించనున్న ఈ పాటలో ప్రభాస్ అదిరిపోయే స్టెప్పులతో ఉర్రూతలూగిస్తాడట. యువీ క్రియేషన్స్ బ్యానర్ లో దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More