2020లో స్టార్ హీరోలందరి సినిమాలు ఉన్నాయి

Published on Jan 24, 2020 1:00 am IST

‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వెరు’ చిత్రాలతో శుభారంభాన్ని అందుకున్న 2020 చాలా క్రేజీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయింది. ఈ యేడాదిలో పెద్ద హీరోలంతా సినినాలతో ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఈ సంవత్సరంలోనే రాజమౌళి డైరెక్షన్లో చరణ్, తారక్ చేస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకానుంది. ఈ సినిమా కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది.

అలాగే మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల ప్రాజెక్ట్ ఈ సంవత్సరమే వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా 2020 మొదటి సంగంలోనే రానుంది. ఇక మరొక భారీ చిత్రం ‘కెజిఎఫ్ 2’ కూడా ఈ ఏడాదిలోనే రిలీజవుతుంది. సుకుమార్, బన్నీల చిత్రం కూడా 2020 రెండవ సగంలో ప్రేక్షకుల్ని పలకరించవచ్చు. అలాగే మహేష బాబు, వంశీ పడిపల్లిల చిత్రం కూడా 2020 లోనే రిలీజయ్యే అవకాశాలున్నాయి.

మరొక స్టార్ హీరో ప్రభాస్ యొక్క ‘జాన్’ మూవీ ఈ సంవత్సరంలోనే విడుదలకానుంది. ఇక ‘నారప్ప’ చిత్రంతో వెంకటేష్, ‘వైల్డ్ డాగ్’ మూవీతో నాగర్జున, బోయపాటి చిత్రంతో బాలకృష్ణ కూడా ఈ సంవత్సరమే థియేటర్లలోకి దిగనున్నారు. మొత్తం మీద ఈ 2020లో ప్రతి స్టార్ హీరో కనీసం ఒక సినిమాతో సందడి చేయనుండటం అభిమానులకు, సినీ ప్రేమికులకు మంచి జోష్ ఇచ్చే విషయం.

సంబంధిత సమాచారం :

X
More