‘జేమ్స్‌బాండ్‌’లో ఓ పాటకు గొంతు కలిపిన అల్లరి నరేష్

‘జేమ్స్‌బాండ్‌’లో ఓ పాటకు గొంతు కలిపిన అల్లరి నరేష్

Published on May 15, 2015 1:30 PM IST

Jamesbond

అల్లరి నరేష్ సినిమాలంటే రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునే సినిమాలుగా అందరూ చెబుతుంటారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ తర్వాత హాస్యకథా చిత్రాలతో ఆ స్థాయిని సొంతం చేసుకున్న హీరోగా అల్లరి నరేష్‌కు పేరుంది. ఇప్పటివరకూ నటుడిగా, నిర్మాతగానే గుర్తింపు తెచ్చుకున్న నరేష్, తన తాజా చిత్రం ‘జేమ్స్‌బాండ్’లో ఓ పాటకు గొంతు కలిపారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ జేమ్స్‌బాండ్ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ద్వారా శ్రీనువైట్ల దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం కానున్నారు.

సాయి కార్తీక్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆడియోను నిన్న సాయంత్రం విడుదల చేశారు. ఈ సినిమాలో ‘వద్దే వద్దు మ్యారేజీ’ అంటూ సాగే ఓ పాటకు అల్లరి నరేష్ గొంతు కలిపారు. పాటకు ముందొచ్చే సాకీ పార్ట్‌ను నరేష్ తన స్టైల్లో ఆలపించి మెప్పించారు. ఇక ‘జేమ్స్‌బాండ్’ అనే పేరు, ‘నేను కాదు.. నా పెళ్ళాం’ అనే ట్యాగ్‌లైన్‌తో బయటకొచ్చిన ఈ సినిమా, ఫస్ట్‌లుక్ పోస్టర్‌‌తోనే అటెన్షన్ క్రియేట్ చేసింది. నిన్నే విడుదలైన ట్రైలర్ ద్వారా ఈ సినిమా ఔట్ అన్డ్ ఔట్ కామెడీ సినిమా అని అర్థమైపోయింది. అల్లరి నరేష్ మళ్ళీ తన మార్క్ సినిమాతో వస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మే నెలాఖర్లో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారు.

సాంగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు