‘అల్లరి’ ఈజ్ బ్యాక్ విత్ ‘జేమ్స్ బాండ్’

‘అల్లరి’ ఈజ్ బ్యాక్ విత్ ‘జేమ్స్ బాండ్’

Published on May 15, 2015 5:15 PM IST

James-Bond
ఈ జెనరేషన్ లో టాలీవుడ్ లో తెలుగు ప్రేక్షకులను నవ్వించే ఏకైక కామెడీ హీరో ఎవరూ అంటే అందరూ ముక్త కంఠంతో చెప్పే పేరు అల్లరి నరేష్. అల్లరోడి సినిమాలు అంటే మినిమమ్ గ్యారంటీ ఎంటర్ టైన్మెంట్ అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. అలాంటి అల్లరి హీరో నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జేమ్స్ బాండ్’, ‘నేను కాదు, నా పెళ్ళాం’ అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్. ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’ సినిమాతో సిస్టర్ పెట్టిన టార్చర్ తో మనల్ని నవ్వించిన అల్లరి నరేష్ ఈ సారి జేమ్స్ బాండ్ తరహా భార్యతో వచ్చే ఇబ్బందుల ద్వారా మనల్ని నవ్వించనున్నాడు. ఈ సినిమా ఆడియో లాంచ్ నిన్న హైదరాబాద్ లో జరిగింది.

ఈ వేడుకలో రిలీజ్ చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కుక్కని చూసి భయపడే అల్లరోడికి బుల్లెట్స్ ని బఠానీల్లా వాడే భార్య వల్ల అల్లరోడు పడే ఇబ్బందిని చాలా బాగా చూపించారు. ఈ సినిమా ట్రైలర్ చూసిన వారంతా రియల్ గానే అల్లరి ఈజ్ బ్యాక్ విత్ సూపర్బ్ కామెడీ అని అంటున్నారు. అల్లరోడికి చుక్కలు చూపించే మాఫియా డాన్ వైఫ్ గా సాక్షి చౌదరి నటించింది. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీను వైట్ల దగ్గర పనిచేసిన సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

తాజా వార్తలు