
టాలీవుడ్ లో సీనియర్ నరేష్, రాజేంద్ర ప్రసాద్ ల తర్వాత కింగ్ అఫ్ కామెడీ అనిపించుకున్న యంగ్ హీరో అల్లరి నరేష్నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జేమ్స్ బాండ్’. ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’ సినిమాతో సిస్టర్ పెట్టె అష్ట కష్టాలకు ఇబ్బంది పడుతూ మనల్ని నవ్వించిన అల్లరి నరేష్ ఈ సారి జేమ్స్ బాండ్ తరహా భార్యతో కలిగే ఇబ్బందుల ద్వారా మనల్ని నవ్వించడానికి సిద్దమవుతున్నాడు. అది పర్ఫెక్ట్ గా తెలియాలనే ‘జేమ్స్ బాండ్’ సినిమాకి ఉపశీర్షికగా ‘నేను కాదు నా పెళ్ళాం’ అని పెట్టారు.
ఈ చిత్ర విశేషాలను తెలియజేయడం కోసం ఈ చిత్ర టీం ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. అందులో ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యిందని, మే 12న సాయి కార్తీక్ అందించిన ఆడియో ని రిలీజ్ చేసి సమ్మర్ కానుకగా మే మూడవ వారంలో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నట్లు హీరోయిన్ సాక్షి చౌదరి తెలిపింది. అల్లరి నరేష్, సాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ఈ సినిమానీ ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా శ్రీను వైట్ల దగ్గర పనిచేసిన సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

