ఈ మినిమమ్ గ్యారింటీ హీరోకి హిట్ వస్తోందా ?

Published on Nov 15, 2018 5:28 pm IST


ఆరు ఏడు సంవత్సరాల క్రితం అల్లరి నరేష్ సినిమాలంటే.. మినిమమ్ గ్యారింటీ లేదా హిట్ అన్నంతగా ప్రేక్షకులు ఈ కామెడీ హీరోని ఆదరించారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అల్లరి నరేష్ వరుస పరాజయాలతో సతమతవుతున్నాడు. పైగా ఎప్పుడూ గ్యాప్ లేకుండా సినిమాలు చేసే నరేష్.. ఇప్పుడు సినిమా సినిమాకి విరామం తీసుకుంటూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోని మరి సినిమాలు చేస్తోన్న విజయం మాత్రం సాధించలేకపోతున్నాడు.

అందుకే ఈ కామెడీ హీరో ఇప్పుడు గతంలో తనకి రెండు హిట్లు ఇచ్చిన సీనియర్ డైరెక్టర్ జి.నాగేశ్వర్ రెడ్డితో ఇంకో సినిమా చేయాలని బాగా సీరియస్ గా ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయిందట. జి.నాగేశ్వర్ రెడ్డి – నరేష్ కాంబినేషన్ లో గతంలో ‘సీమ శాస్త్రి, సీమ టపాకాయ్’ లాంటి హిట్ చిత్రాలు వచ్చాయి.

మరి జి.నాగేశ్వర్ రెడ్డి అన్నా అల్లరి నరేష్ కి హిట్ ఇస్తాడో లేదో చూడాలి. నరేష్ ఇటీవలే భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో సునీల్ తో కలిసి చేసిన ‘సిల్లీ ఫెలోస్ ‘ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ చిత్రంగా నిలబడలేకపోయింది.

సంబంధిత సమాచారం :

X
More