ఆయనుంటే మంచి చెడు చెప్పేవారు- అల్లరి నరేష్

ఆయనుంటే మంచి చెడు చెప్పేవారు- అల్లరి నరేష్

Published on Jun 30, 2020 9:00 AM IST

కామెడీ కేర్ ఆఫ్ అడ్రెస్ అల్లరి నరేష్. ఆయన పుట్టిన రోజు నేడు. 18ఏళ్ళ కెరీర్ లో 50కి పైగా సినిమాలలో నటించిన ఈ తరం అత్యధిక చిత్రాల హీరో. తన పుట్టిన రోజు సంధర్భంగా ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకున్న అల్లరి నరేష్ తన నాన్నగారు ప్రముఖ దర్శకుడు ఈ వి వి సత్యనారాయణ గురించి మాట్లాడారు. జూన్‌ 10న నాన్నగారి జయంతి. 2011 జనవరి 21న నాన్న క్యాన్సర్‌ వ్యాధితో చనిపోయారు. అన్నయ్య నిశ్చితార్థానికి నెల ముందు మాకు దూరమయ్యారాయన. 2012లో అన్నయ్య, 2015లో నా పెళ్లి జరిగింది. మా వివాహాలను ఆయన చూడలేదు.. మనవడు, మనవరాళ్లతో ఆడుకోలేదు. జీవితమంతా కష్టపడ్డారు.. సుఖపడాల్సిన వయసులో మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. మా పిల్లల అల్లరి చూసినప్పుడల్లా ‘వాళ్లకి తాతయ్య ఉండుంటే బాగుండేది’ అనిపిస్తుంది. అన్నారు

అల్లరి నరేష్ ఇంకా మాట్లాడుతూ….నాన్నగారుంటే ఓ ధైర్యం.. మంచీ చెడూ చెప్పేవారు. మా కుటుంబానికి మర్రిచెట్టులాంటివారు. చాలా మందిని ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. నాన్నలేని లోటు మాత్రం ఎప్పుడూ తీరదు, అన్నారు. ఇక ప్రస్తుతం నరేష్ నాంది, బంగారు బుల్లోడు అనే రెండు చిత్రాలలో నటిస్తున్నారు. నాంది సీరియస్ కంటెంట్ తో తెరకెక్కగా బంగారు బుల్లోడు నరేష్ మార్కు మూవీలా ఉండనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు