అక్కినేని హీరోతో పోటీకి దిగుతున్న అల్లరి నరేష్ !
Published on Aug 17, 2017 5:41 pm IST


గత కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ ఈసారి జి. ప్రజీత్ దర్శకత్వంలో చేసిన ‘మేడ మీద అబ్బాయి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ తో నిండిన ఈ సినిమా తనకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తుందని నరేష్ నమ్మకంగా ఉన్నారు. ఇటీవలే షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా సెప్టెంబర్ 8న సినిమా విడుదల తేదీగా నరేష్ ప్రకటించారు.

అయితే అదే రోజున అక్కినేని నాగ చైతన్య ‘యుద్ధం శరణం’ చిత్రం కూడా రిలీజ్ కానుంది. చైతన్య ‘ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో, రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి వరుస హిట్లు ఇవ్వడంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. కాబట్టి ఈ చిత్రంతో నరేష్ పోటీ పడవలసి ఉంటుంది. అలాగే మంచు మనోజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ‘ఒకడికి మిగిలాడు’ కూడా ఇదే రోజున వస్తుందనే వార్త కూడా ప్రచారంలో ఉంది. ఒకవేళ ఇది కూడా అదే రోజున వస్తే పోటీ ఇంకా పెరిగే ఛాన్సుంది.

 
Like us on Facebook