అల్లరి నరేష్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్..!

అల్లరి నరేష్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్..!

Published on May 19, 2015 8:54 PM IST

Allari-Naresh's-wedding-dat
తెలుగు సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ తర్వాత హాస్యకథా చిత్రాల హీరోల్లో ఆ స్థాయి పేరు సంపాదించుకున్న హీరోగా అల్లరి నరేష్‌కి మంచి పేరుంది. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అల్లరి నరేష్. తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో ఉంటూ వస్తోన్న ఆయన తాజాగా పెళ్ళికి సిద్ధమైన విషయం తెలిసిందే!

గత కొంత కాలం క్రితమే అల్లరి నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ పెళ్ళి జరిగింది. ఇక అప్పట్నుంచి ఆర్యన్ రాజేష్ తమ్ముడు అల్లరి నరేష్ పెళ్ళెప్పుడూ? అనే ప్రశ్న వినబడుతూ వస్తోంది. ఆ ప్రశ్నలన్నింటికీ తెరదించుతూ చెన్నైకి చెందిన విరూపతో పెళ్ళికి సిద్ధమయ్యారు అల్లరి నరేష్. మే 3న నిశ్చితార్థ వేడుక జరగ్గా, మే 29న రాత్రి 9 :15నిమిషాలకు పెళ్ళి భాజాలు మోగనున్నాయి. హైద్రాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్‌గా ఈ పెళ్ళి వేడుక జరగనుంది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం జేమ్స్‌బాండ్ త్వరలోనే విడుదల కానుంది.

తాజా వార్తలు