ఇంతకీ బోయపాటి సినిమాలో హీరో ఎవరు ?

Published on Jul 17, 2019 7:25 pm IST

‘వినయ విధేయరామ’ ప్లాప్ ఎఫెక్ట్ బోయపాటి పై బాగానే పడింది. నందమూరి బాలకృష్ణతో అనుకున్న సినిమా కూడా పోస్ట్ ఫోన్ అయి.. చివరికీ క్యాన్సల్ అయింది. దాంతో ఎప్పుడూ వరుస ఆఫర్స్ తో బిజీ బిజీగా ఉండే బోయపాటి గత ఐదు నెలల నుండీ ఖాళీగా ఉన్నాడు. ఈ క్రమంలో బోయపాటి శ్రీను సినిమా ఎప్పుడు ఉంటుందో ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదని ఈ మధ్య సోషల్ మీడియాలో వరుసగా వార్తలు వచ్చాయి.

మొత్తానికి ఆ వార్తలకు తెర దించుతూ.. ‘త్వరలోనే తన బ్యానర్ పై బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించాడు. ఎప్పుడో మొదలవ్వాల్సిన సినిమా ఇప్పటికి క్లారిటీ వచ్చింది, అయితే బోయపాటి – అల్లు అరవింద్ కాంబినేషన్ లో వచ్చే మూవీలో ఎవరు హీరోగా నటిస్తారు..? మెగా హీరోల్లో ఎవరో ఒకళ్ళు హీరోగా నటిస్తారా..? లేదా వేరే హీరో ఎవరైనా నటిస్తారా అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది.

మరి ఇంతకీ బోయపాటి – బాలయ్య సినిమా ఉంటుందా ? లేదా అనే విషయం కూడా తేలాల్సి ఉంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పట్లో సినిమా లేకపోయినా వచ్చే ఏడాది అయినా ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందట.

సంబంధిత సమాచారం :