హీరోగా బన్నీకి పదిహేడేళ్లు..!

Published on Mar 28, 2020 11:16 am IST

హీరోగా బన్నీ 17ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. ఆయన మొదటి చిత్రం బన్నీ విడుదలైన నేటికి సరిగ్గా 17 సంవత్సరాలు. 2003 మార్చ్ 28న వేసవి కానుకగా బన్నీ డెబ్యూ మూవీ గంగోత్రి విడుదలైంది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ చిత్రం మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. కీరవాణి సంగీతం ఆ సినిమాలో హైలెట్ గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన బన్నీ రెండవ చిత్రం ఆర్య లవ్ స్టోరీస్ లో ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలిచింది. సూపర్ హిట్ అందుకున్న ఆర్య బన్నీకి మంచి గుర్తింపు తెచ్చింది. బన్నీ బెస్ట్ డాన్సర్ అని ఆ చిత్రం ప్రూవ్ చేసింది.

తన కెరీర్ లో అనేక సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇక ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన అల వైకుంఠపురంలో మూవీ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ తన 20వ చిత్రంలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More