తన మొదటి కొరియోగ్రాఫర్ మరణంపై ఎమోషన్ అయిన బన్నీ..!

Published on Jul 3, 2020 11:57 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఒక్కసారిగా యుతలో అపారమైన క్రేజ్ ఏర్పడటానికి ప్రధాన కారణం అతని మెరుపు వేగపు డాన్స్ మూమెంట్స్ అని చెప్పాలి. బన్నీ తెలుగు సిల్వర్ స్క్రీన్ కు మొట్ట మొదటిసారిగా కనిపించిందే తన డాన్స్ మూమెంట్స్ తో. మావయ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “డాడీ” సినిమాలో చిరు ఫేవరేట్ స్టూడెంట్ గా కనిపించినపుడు బన్నీ వేసిన స్టెప్స్ ఆ టైంలో మంచి హాట్ టాపిక్ అయ్యాయి.

అలా ఆ టైంలో బన్నీకు తన మొదటి చిత్రంతోనే గుర్తింపు తెచ్చేలా చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఈ శుక్రవారం గుండెపోటు తో కన్ను మూశారు. ఎంతో అనుభవసాలి అయిన ఆమె మరణంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ద్వారా తన సంతాపాన్ని తెలిపారు.

తన మొట్ట మొదటి కొరియోగ్రాఫర్ సరోజ్ గారి మరణం తనను ఎంతగానో బాధించింది అని అలాంటి లెజెండరీ కొరియోగ్రాఫర్ తో తాను మొదటి సినిమాతో పని చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా అని బన్నీ తెలిపారు. ఆ సమయంలో ఆమెతో కలిసి పని చేసిన ఫోటోలను షేర్ చేసి ఆమెకు ఎప్పుడూ తన గౌరవం మరియు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని బన్నీ ఎమోషనల్ అయ్యారు.

సంబంధిత సమాచారం :

More