“జాతి రత్నాలు” టీంకి బన్నీ ఎగ్జైటింగ్ కంగ్రాట్స్.!

Published on Mar 12, 2021 11:00 am IST

ఈ మహా శివరాత్రి కానుకగా మన తెలుగులో మంచి సినిమాలు విపరీతమైన బజ్ నడుమ విడుదల అయ్యాయి. అయితే వాటన్నిటిలో మాత్రం భారీ హైప్ లో విడుదల కాబడిన చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “జాతి రత్నాలు” సినిమా అనే చెప్పాలి. ప్రభాస్ నిర్మాత నాగ్ అశ్విన్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం సాలిడ్ ఓపెనింగ్స్ ను కూడా దక్కించుకుంది. నవీన్ పోలిశెట్టి హీరోగా ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ లు మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎగ్జైటింగ్ పోస్ట్ పెట్టి వారి టీంకు స్పెషల్ కంగ్రాట్స్ చెప్పారు.

నిన్న రాత్రే సినిమా సినిమా చూశానని, సినిమా చూసి ఒక లెక్కలో నవ్వుకున్నాని మొత్తం సినిమా యూనిట్ కు నా కంగ్రాట్స్ తెలుపుతున్నాని తెలుపుతున్నాని అంతే కాకుండా నవీన్ తన పెర్ఫామెన్స్ తో సినిమాలో అదరగొట్టాడని అలాగే ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లకు కూడా స్పెషల్ మెన్షన్ చేసి చెప్పారు. అలాగే సినిమా టెక్నిషియన్స్ నాగ్ అశ్విన్ మరియు దర్శకుడు అనుదీప్ అందరి కోసం కూడా స్పెషల్ గా మెన్షన్ చేసి తన స్పెషల్ కంగ్రాట్స్ ను బన్నీ తెలిపారు. లాస్ట్ లో బ్రెయిన్ ఆఫ్ చేసి సినిమా చూసి ఎంజాయ్ చెయ్యమని చెప్పారు.

సంబంధిత సమాచారం :