హైదరాబాద్ వెదర్‌ను ఎంజాయ్‌ చేసిన బన్నీ ఫ్యామిలీ..!

Published on Jul 23, 2021 2:10 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ వెదర్‌ను ఎంజాయ్ చేశాడు. అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి వారి ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలను, విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షపు జల్లులతో హైదరాబాద్‌ వాతావరణం చల్లబడిన సంగతి తెలిసిందే.

దీంతో బన్నీ తన భార్య, పిల్లలతో కలిసి హైదరాబాద్ వెదర్‌ను ఎంజాయ్‌ చేస్తూ లాంగ్‌డ్రైవ్‌కి వెళ్ళొచ్చారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై నుంచి వెళుతుండగా కారులో నుంచి అయాన్‌, అర్హ లైటింగ్‌ని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను స్నేహా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇదిలా ఉంటే బన్నీ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో “పుష్ప” సినిమాలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :