హైదరాబాద్ లో పెద్ద ఫైట్ చేస్తున్న అల్లు అర్జున్ !
Published on Nov 18, 2016 4:40 am IST

allu-arjun
‘సరైనోడు’ చిత్రంతో ఈ సంవత్సరం మొదటి ఘన విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ కాటా గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం బన్నీ సరికొత్తగా రెండు గెటప్ లలో కనిపించనున్నాడట. అందులో పీకటి బ్రాహ్మణ పాత్ర కాగా మరొకటి స్టైలిష్ కుర్రాడి పాత్ర అన్ని తెలుస్తోంది. గత నెల ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ప్ర్రస్తుతం హైదరాబాదా లో జరుగుతోంది. ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ నేతృత్వంలో ఒక భారీ ఫైటింగ్ సీక్వెన్స్ ను ఇక్కడ ప్లాన్ చేశారట.

మొత్తం వారం రోజుల పాటు షూట్ చేయబోయే ఈ ఫైటింగ్ సీన్ సినిమాలో చాలా గ్రాండ్ గా కనిపిస్తుందని అంటున్నారు. ఈ షెడ్యూల్ తరువాత కాస్త గ్యాప్ తీసుకుని కొత్త షెడ్యూల్ ను ప్రారంభిస్తారు. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నాడు. టైటిల్ లోనే వైవిధ్యం నింపుకున్న ఈ చిత్రం యొక్క కథ, కథనాలు కూడా భిన్నంగా ఉంటాయని చెబుతుండటంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి.

 
Like us on Facebook