‘బన్నీ’ స్పీడే కాదు, కథలూ మారాయి !

Published on May 5, 2019 11:51 pm IST

ఎట్టకేలకూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పీడ్ పెంచారు. ఈ ఏడాది మూడు సినిమాలను వరుసగా ప్లాన్ చేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తోన్న సినిమా శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ తో కలిసి చినబాబు నిర్మించనున్నారు.

ఒక పక్క త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే మరో సినిమాకి డేట్ ఫిక్స్ చేసేశాడు బన్నీ. ‘రంగస్ధలం’తో ఫామ్ లోకి వచ్చిన సుకుమార్ దర్శకత్వంలో సినిమా చెయ్యడానికి అంగీకరించిన బన్నీ.. ఈ నెల 11వ తేదీన ఆ సినిమాని అధికారికంగా లాంచ్ చేయనున్నారు. మరి ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల గురించి తెలియాల్సి ఉంది.

కాగా ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక అంటే ఈ ఏడాది ఆఖర్లో వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ‘ఐకాన్’ సినిమాను మొదలుపెట్టనున్నాడు బన్నీ. మొత్తానికి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళటానికీ చాలా కాలం ఎదురుచూసిన అల్లు అర్జున్.. ఇప్పుడు ఏడాది మొత్తం మూడు సినిమాలతో బిజీ బిజీగా గడపనున్నాడు.

ఇక ప్ర్తస్తుతం త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్జున్ ను కాస్త వైవిధ్యంగా చూపించబోతున్నాడట త్రివిక్రమ్. బన్నీ డ్రెసింగ్ స్టైల్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ వరకూ ఈ సినిమాలో కొత్త అల్లు అర్జున్ ని చూస్తామని తెలుస్తోంది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో కూడా బన్నీ మాడ్యులేషన్ని కాస్త కొత్తగా మార్చాడు త్రివిక్రమ్.

అలాగే సుకుమార్ సినిమాలో బన్నీ సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నారని ఇది ఒక కాఫ్ స్టోరీ అని సమాచారం. అదే విధంగా వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ‘ఐకాన్’లో కూడా బన్నీది డిఫరెంట్ క్యారెక్టర్ అంట. మొత్తానికి బన్నీ స్పీడ్ తో పాటు కథలును మార్చాడు.

సంబంధిత సమాచారం :

More