అల్లు అర్జున్ కొత్త చిత్రం ఆ రోజే ప్రారంభం కానుంది !

Published on Oct 28, 2018 3:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 19వ చిత్రం కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇక ఈ చిత్రం డిసెంబర్ 11న ఆఫిషియల్ గా ప్రారంభం కానుందని సమాచారం.

అయితే ఈ చిత్రం బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కనుందని వచ్చిన వార్తల్లో నిజం లేదట. అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ ఒక మంచి కథను సిద్ధం చేశాడట. పక్కా ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రం గురించి త్వరలోనే అధికారిక సమాచారం వెలుబడనుంది. ఇక ఇంతకుముందు అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘జులాయి ,సన్ అఫ్ సత్యమూర్తి’ చిత్రాలు మంచి విజయం సాధించాయి. మరి ఈచిత్రం వారికి హ్యటిక్ విజయాలను అందిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :