హంగులు, ఆర్భాటాలు అవసరం లేదంటున్న బన్నీ

Published on Feb 15, 2020 3:00 am IST

ఒక భాషలో స్టార్ హీరో హోదా సాధించిన ఏ హీరో అయినా వేరే పరిశ్రమలోకి అడుగుపెట్టాలంటే భారీ బడ్జెట్, కమర్షియల్ కథ, స్టార్ దర్శకుడ్ని చేతిలో పెట్టుకునే సినిమా చేస్తారు. ఇలా చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. వారిలో కొందరు విజయం సాధిస్తే ఇంకొందరు ఫ్లాప్ అయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమలోకి వెళ్లాలనుకుంటున్న అల్లు అర్జున్ మాత్రం ఇందుకు భిన్నంగా చేస్తున్నారు.

తాను తెలుగులో స్టార్ హీరోనే అయినా హిందీలోకి మాత్రం ముందుగా ఒక నటుడిగా ప్రవేశించాలని, అందుకే హంగులు, హడావుడి లేకుండా స్టోరీ బేస్డ్ ఫిల్మ్ చేయాలని భావిస్తున్నారట. అంటే అక్కడి ప్రేక్షకులకు స్టార్ నటుడిలా కాకుండా డెబ్యూ నటుడిగా పరిచయమవుతారన్నమాట. మొత్తానికి బన్నీ ఆలోచనా విధానం చూస్తే విజయానికి దగ్గరగా అడుగులు వేస్తున్నట్టే ఉంది.

సంబంధిత సమాచారం :