మలయాళీలకు థ్యాంక్స్ చెప్పిన ‘అల్లు అర్జున్’

20th, August 2016 - 08:55:03 AM

allu-arjun
తెలుగు హీరోల్లో స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సినిమా సినిమాకు నటనను, డ్యాన్సులను మెరుగుపరుచుకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడీ యంగ్ హీరో. అందుకే బన్నీకి తెలుగునాట మాత్రమే గాక కేరళలో కూడా బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ బన్నీని అందరూ ‘మల్లు అర్జున్’ అని పిలుచుకుంటుంటారు. తాజాగా ‘సరైనోడు’ చిత్రం అక్కడ పెద్ద హిట్టై రూ.8 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే స్టార్ ఏషియానెట్ మిడిల్ ఈస్ట్ ఆయనకు ‘ప్రవాసి రత్న పురస్కారం’ ప్రకటించింది.

నిన్న సాయంత్రం దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఓనం పండుగ సందర్భంగా జరిగిన పూనోనమ్ -2016 అనే కార్యక్రమంలో మలయాళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు, దుబాయ్ లోని మలయాళీ ప్రజలు, ఇతర ప్రముఖుల సమక్షంలో అల్లు అర్జున్ కు ఈ పురస్కారాన్ని ప్రధానం చేశారు. ఈ సందర్బంగా బన్నీ దుబాయ్ లో ఉన్న మలయాళీలకు థ్యాంక్స్ చెప్పారు. అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా తెలిపారు.