సోషల్ మీడియాలో మరో మైల్ స్టోన్ సెట్ చేసిన బన్నీ.!

Published on May 26, 2021 9:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయినా కూడా బన్నీ హవా ఓ లెక్కలో కనిపిస్తుంది. అలా యూట్యూబ్ టీజర్ నుంచి సినిమాల వ్యూస్ వరకు అలాగే పేస్ బుక్ ఫాలోవర్స్ నుంచి ఇన్స్టాగ్రామ్ వరకు ఎప్పటి నుంచో బన్నీ ఫాలోయింగ్ సాలిడ్ గా అందులోని ఎలాంటి పాన్ ఇండియన్ సినిమా చెయ్యకుండా ఉంది.

మరి లేటెస్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో మరో మైల్ స్టోన్ ను బన్నీ సెట్ చేసి పెట్టాడు. ఫాస్టెస్ట్ 12 మిలియన్ ఫాలోవర్స్ ను లాక్ చేసిన మరో సౌత్ ఇండియన్ మరియు తెలుగు హీరోగా బన్నీ నిలిచాడు.మొదటగా ఈ మార్క్ కొన్ని రోజుల కితమే విజయ్ దేవరకొండ అందుకున్నాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ తో తన హ్యాట్రిక్ చిత్రం “పుష్ప” తీస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం పాన్ ఇండియన్ లెవెల్లో రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :