స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రానున్న రెండవ సినిమా ‘S/O సత్యమూర్తి’. ఈ కుటుంబ కథా చిత్రానికి ‘విలువలే ఆస్తి’ అనేది ట్యాగ్ లైన్. మార్చి 15న ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేసారు. అప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పలు రిలీజ్ డేట్స్ బయటకి వచ్చినా కచ్చితమైన తేదీ వెలువడలేదు. మాకు ఈ చిత్ర టీంలోని సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం ‘S/O సత్యమూర్తి’ని ఏప్రిల్ 9న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరు కల్లా ఫస్ట్ కాపీని సిద్దం చేసే పనిలో ఉన్నారు. అల్లు అర్జున్ మొదటిసారి ఓ వెడ్డింగ్ ప్లానర్ గా ఈ మూవీలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్ సరసన సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర, స్నేహ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అత్తారింటికి దారేది తరహాలోనే ‘S/O సత్యమూర్తి’ కూడా హాయ్ డోస్ సెంటిమెంట్ తో ప్రేక్షకులను కట్టి పడేస్తుందని సమాచారం.


